Maratha Reservation | హింసాత్మకంగా మారిన మరాఠా రిజర్వేషన్ ఆందోళన.. రాళ్లతో దాడి, వాహనాలకు నిప్పు
Maratha Reservation | మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ (Maratha Reservation) కోసం చేపట్టిన ఆందోళనలు శనివారం కూడా హింసాత్మకంగా మారాయి. జాల్నా జిల్లాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
ముంబై: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ (Maratha Reservation) కోసం చేపట్టిన ఆందోళనలు శనివారం కూడా హింసాత్మకంగా మారాయి. జాల్నా జిల్లాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకున్నది. జల్నా జిల్లా అంబాద్ పరిధిలోని అంతర్వాలి సరతి గ్రామంలో నిరసనలు మొదలయ్యాయి. మనోజ్ జరంగే నేతృత్వంలో మంగళవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిరసన శుక్రవారం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు లాఠీచార్జితోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో 20 మంది ఆందోళనకారులతో పాటు 12 మంది పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
మరోవైపు మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని విపక్ష పార్టీలు ఖండించాయి. అయితే శాంతి పాటించాలని సీఎం ఏక్నాథ్ షిండే పిలుపునిచ్చారు. హింసపై ఉన్నతస్థాయి విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
https://twitter.com/ANI/status/1697905690432647656?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1697905690432647656%7Ctwgr%5E3d92f101904d7d65a07c0a796a5c4e886ba34851%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fmumbai%2Fmaharashtra-stones-pelted-vehicles-torched-as-protests-prevail-in-jalna-visuals-surface
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

