Money seaze | నగరంలో 1.97 కోట్ల నగదు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు..!
Money seaze | లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నగరంలో భారీగా నగదు పట్టుబడుతోంది. సోమవారం కూడా ఏకంగా రూ.1,96,70,324 నగదును సైబరాబాద్ SOT పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బందితో కలిసి 8 ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో రూ.1,81,70,324 నగదు పట్టుబడింది.
Money seaze : లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నగరంలో భారీగా నగదు పట్టుబడుతోంది. సోమవారం కూడా ఏకంగా రూ.1,96,70,324 నగదును సైబరాబాద్ SOT పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బందితో కలిసి 8 ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో రూ.1,81,70,324 నగదు పట్టుబడింది.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. నగరంలో ఎక్కడ ఎంత నగదు పట్టుబడింది..? ఏ ఏరియా టీమ్ పట్టుకుంది..? తదితర వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పట్టుబడ్డ నగదు వివరాలు..
1. SOT మేడ్చల్ టీమ్ – BRINKS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 10 UD 1868 – నగదు రూ.74,07,791 – పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్.
2. SOT శంషాబాద్ టీమ్ – CMS వాహనం TS 10 UD 6979 – నగదు రూ.34,00,000 – కొత్తూరు పోలీస్ స్టేషన్
3. SOT మాదాపూర్ టీమ్ – రైటర్ సేఫ్ గార్డ్ వాహనం TS 09 UD 4042 – నగదు రూ.21,74,520 – మాదాపూర్ పోలీస్ స్టేషన్
4. SOT మాదాపూర్ టీమ్ – రైటర్ సేఫ్ గార్డ్ వాహనం TS 09 UD 4033 – నగదు రూ.19,26,405 – చందంగార్ పోలీస్ స్టేషన్
5. SOT రాజేంద్రనగర్ టీమ్ – రైటర్ సేఫ్ గార్డ్ వాహనం MP 09 GH 6293 – నగదు రూ.15,49,848 – రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్
6. SOT రాజేంద్రనగర్ టీమ్ – రైటర్ వెహికల్ TS 09 UD 3718 – నగదు రూ.11,63,560 – నార్సింగి పోలీస్ స్టేషన్
7. SOT బాలానగర్ టీమ్ – రేడియంట్ వెహికల్ TS 11 UD 2560 – నగదు రూ.5,48,200 – KPHB పోలీస్ స్టేషన్
8. SOT మాదాపూర్ టీమ్ – ప్రైవేట్ వ్యక్తి తన XUV 100 నెంబర్ TS 07 EX 9200 – నగదు రూ.15,00,000 – మోకిల పోలీస్ స్టేషన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

