ముంబై: కూల్చివేతలను జనం అడ్డుకున్నారు. (Demolition Drive) ఈ నేపథ్యంలో ఆగ్రహించిన స్థానికులు ఒక్కసారిగా పోలీసులు, అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఐదుగురు అధికారులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. నగరంలోని పోవై ప్రాంతంలో గురువారం డిమోలిషన్ డ్రైవ్‌ను బీఎంసీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు.
కాగా, గుడిసెల కూల్చివేతలపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అలాగే ఉన్నట్టుండి బీఎంసీ అధికారులు, పోలీసులపైకి జనం రాళ్లు రువ్వారు. ఊహించని ఈ సంఘటనకు అధికారులు, పోలీసులు షాక్ అయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. జనం రాళ్ల దాడిలో ఐదుగురు అధికారులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భద్రత కోసం మరింత మంది పోలీసులను అక్కడకు రప్పించారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Watch | Stone pelting on @MumbaiPolice and BMC officials in Mumbai's Powai area during a demolition drive. 5 officers injured#Powai #Mumbai #MumbaiPolice #BMC pic.twitter.com/RCzHyHV1ZO
— Free Press Journal (@fpjindia) June 6, 2024