మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 16:24:31

100 అడుగులు వేసి క‌రోనా ఉందో లేదో తెలుసుకోవ‌చ్చు!

100 అడుగులు వేసి క‌రోనా ఉందో లేదో తెలుసుకోవ‌చ్చు!

ఇప్పుడు ప్ర‌తిఒక్క‌రినీ ప‌ట్టి పీడిస్తున్నది క‌రోనా. ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్ల‌క‌పోయినా స‌రే కొవిడ్‌-19 వైర‌స్ సోకుతున్న‌ది. దీనికి సంబంధించిన‌ ల‌క్ష‌ణాలు ఏవైనా క‌నిపించిన‌ప్పుడు హాస్పిట‌ల్‌కు వెళ్లి టెస్ట్ చేయించుకోవ‌డానికి కూడా భ‌య‌ప‌డుతున్నారు ప్ర‌జ‌లు. అందుక‌ని ఇంట్లోనే  సుర‌క్షితంగా క‌రోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి ఆరోగ్య శాఖ ఒక ప‌ద్ధ‌తిని గుర్తించిన‌ట్లు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.

ఇంట్లోనే ప్ర‌తిఒక్క‌రూ 100 అడుగులు వేసి టెస్ట్ చేసుకోవాల‌ని తెలిపారు. ఈ 100 అడుగులు వేసే స‌మ‌యంలో ఆయాసం వ‌స్తే కొంత రిస్క్‌లో ఉన్న‌ట్లే అని అన్నారు. ఒక ప‌రిశోధ‌న‌లో 100 మందిని ప‌రీక్షించ‌గా 58 మంది ఆయాస‌ప‌డ్డార‌ని తేలింది. వీరికి క‌రోనా టెస్టులు చేయ‌గా 8 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌న్నారు.


logo