Duvvuri Subbarao | న్యూఢిల్లీ, మే 11: భారత్‌లోని సివిల్ సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థను సంస్కరించి..వాటిని కొత్తగా ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఉద్ఘాటించారు. ఈ వ్యవస్థలో నీతి, నిజాయితీ తగ్గుతున్నట్టు తాను భావిస్తున్నానన్నారు.
ఆయన ప్రచురించిన ‘జస్ట్ ఏ మెర్సినరీ?: నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పుస్తకంలో ఐఏఎస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.‘ఎప్పుడో బ్రిటీష్‌వారు తయారు చేసిన ఐఏఎస్ అనే స్టీల్ ఫ్రేమ్ ఇప్పుడు తుప్పు పట్టింది. అలా అని దాన్ని బయటకు విసిరేయమని కాదు. దానిని సరిచేసి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఐఏఎస్‌ల్లో ఉన్న లింగ వివక్ష గురించి ఆయన ప్రస్తావించారు.