Allahabad High Court | లక్నో, సెప్టెంబర్ 24: ఉద్యోగ నిర్వహణలో భాగంగా భర్తకు దూరంగా నివసించడం క్రూరమైన చర్య, విడిచిపెట్టడంగా భావించలేమని, విడాకులు పొందడానికి అది ఎంతమాత్రం కారణం కాజాలదని అలహాబాద్ హైకోర్టు ఒక ప్రధాన తీర్పులో పేర్కొంది. ఈ కారణంతో విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన వ్యక్తి పిటిషన్‌ను జస్టిస్‌లు సుమిత్రా దయాల్ సింగ్, దోనాది రమేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఉద్యోగ నిర్వహణలో భాగంగా తన భాగస్వామి 21 ఏండ్లుగా తనకు దూరంగా ఉంటున్నదని పిటిషనర్ ఆరోపించారు. విధి నిర్వహణ కోసం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో భార్య ఔరియాలో, భర్త ఝాన్సీలో నివసిస్తున్న అంశాన్ని ఆధారంగా చేసుకుని దానిని క్రూరత్వంగా, భార్య అతడిని విడిచిపెట్టి ఉంటున్నట్టుగా నిర్ధారించలేమని హైకోర్టు పేర్కొంది.