Supreme Court | న్యూఢిల్లీ: నిందితునికి మంజూరైన బెయిలును యాంత్రికంగా నిలిపివేయవద్దని న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు చెప్పింది. అత్యంత అరుదైన కేసుల్లో మినహా, ఎటువంటి కారణం లేకుండా బెయిలును నిలిపివేయరాదని స్పష్టం చేసింది.
నిందితుని స్వేచ్ఛను కోర్టులు యథాలాపంగా కట్టడి చేయకూడదని వివరించింది. ఉగ్రవాద కేసుల్లో ప్రమేయం ఉండటం, బెయిల్ ఆర్డర్ సహేతుకంగా లేకపోవడం, చట్ట విరుద్ధంగా ఉండటం వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించాలని తెలిపింది. స్వేచ్ఛను కట్టడి చేస్తే, రాజ్యాంగంలోని అధికరణ 21 ఎక్కడికి పోతుందని ప్రశ్నించింది.