న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటి విగ్రహాల స్థానాలను మార్చారు. (Statues shifted in Parliament) పార్లమెంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ల్యాండ్‌స్కేపింగ్ ఆధునీకరణ కోసం అన్ని విగ్రహాలను ప్రాంగణంలో ఒకే చొట ఉంచుతున్నారు. ఇందులో భాగంగా గిరిజన నాయకుడు బిర్సా ముండా, మహారాణా ప్రతాప్ విగ్రహాలను కూడా పాత పార్లమెంట్ భవనం, పార్లమెంట్ లైబ్రరీ మధ్య ఉన్న గార్డెన్‌లోని మార్చారు. దీంతో పార్లమెంటు ఆవరణలోని ప్రముఖుల విగ్రహాలన్నీ ఇప్పుడు ఒకే చోట ఉన్నాయి.
కాగా, పార్లమెంట్ ఆవరణలోని ప్రముఖుల విగ్రహాల స్థానాలను మార్చడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌర్జన్యపు చర్య అని ఆరోపించింది. పార్లమెంట్ భవనం ముందు ఉన్న గాంధీ, అంబేద్కర్, శివాజీ విగ్రహాలను వాటి స్థలాల నుంచి మార్చడం దారుణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో విమర్శించారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ పరాజయంతో పార్లమెంట్ ప్రాంగణంలోని శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం మార్చిందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా విమర్శించారు. అలాగే గుజరాత్లో క్లీన్ స్వీప్ రాకపోవడంతో గాంధీ విగ్రహాన్ని కూడా మరోచోటకు తరలించారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చకుండా ఉంటారా? అని ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నించారు.
Statues of Chhatrapati Shivaji Maharaj, Mahatma Gandhi, and Dr. Babasaheb Ambedkar have just been removed from their places of prominence in front of the Parliament House. This is atrocious. pic.twitter.com/NA12QjCBAK
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 6, 2024