న్యూఢిల్లీ, జనవరి 20: అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్ట్) కింద లంచం, అవినీతి నేరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందు సీబీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 17 ప్రకారం ఈ చట్టం పరిధిలోకి వచ్చే నేరాలపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయవచ్చని ధర్మాసనం సోమవారం తన తీర్పులో స్పష్టం చేసింది.