Kumbh Mela | మహాకుంభ్ నగర్ : ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. దీనిలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసం 1,60,000 టెంట్లు, 1,50,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు.
1,250 కిలోమీటర్ల పైప్లైనును సిద్ధం చేస్తున్నారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, 2 వేల సోలార్ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ రిస్ట్బ్యాండ్స్, యాప్ ట్రాకింగ్లతో భక్తులను లెక్కిస్తారు. ఈ మేళా 45 రోజులపాటు జరుగుతుంది.