పశ్చిమబెంగాల్, మార్చి 10: పశ్చిమబెంగాల్లో నల్లమందు సాగుకు అనుమతించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు రాష్ట్ర సీఎం మమత బెనర్జీ వెల్లడించారు. కొన్ని రాష్ర్టాల్లోనే నల్లమందును సాగు చేస్తున్నందున అది ఖరీదైనదిగా మారిందని పేర్కొన్నారు. అన్ని నల్లమందులు డ్రగ్స్ కావని అన్నారు. ‘నాలుగు రాష్ట్రాల్లోనే వాటి సాగు ఎందుకు? పశ్చిమబెంగాల్లో ఎందుకు సాగు చేయకూడదు?’ అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్లో నల్లమందు సాగు అనుమతిపై ప్రతిపక్ష బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు.