Stampede : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga) లోని వేంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy temple) లో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Naredra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ తొక్కిలాట ఘటన బాధాకరమైనదని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ప్రధాని తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది.
ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. కాగా ఈ ఘటనలో మరో 31 మంది గాయపడ్డారు. వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.