Watch: ఐదు ఉద్యోగాలకు వెయ్యి మందికిపైగా రాక.. జాబ్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట
Stampede Like Situation | ఐదు ఉద్యోగాల కోసం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అహ్మదాబాద్: ఐదు ఉద్యోగాల కోసం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్
ఇంటర్వ్యూలో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. (Stampede Like Situation) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 9న అంకలేశ్వర్‌లోని హోటల్ లార్డ్స్ ప్లాజాలో ఒక కెమికల్ సంస్థ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. షిఫ్ట్ ఇన్ఛార్జ్, ప్లాంట్ ఆపరేటర్, సూపర్వైజర్, ఫిట్టర్, మెకానికల్, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం వెయ్యి మందికిపైగా తరలివచ్చారు.
కాగా, రెజ్యూమ్ కాపీలను చేతుల్లో పట్టుకున్న అభ్యర్థులు క్యూలో వేచి ఉన్నారు. హోటల్ గేటు నుంచి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరుగడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రైలింగ్ ఒంగిపోగా దాని పై నుంచి కొందరు కిందపడ్డారు. ఈ నేపథ్యంలో గందరగోళానికి దారితీసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
"जॉब इंटरव्यू" के लिए धक्का-मुक्की#Gujarat के अंकलेश्वर की एक होटल में एक प्राईवेट कंपनी में जॉब के लिए इंटरव्यू देने के लिए आए बेरोजगार युवाओ के बीच इंटरव्यू के लिए धक्का-मुक्की
सोचिए ये तो सिर्फ जॉब इंटरव्यू देने के लिए इतना संघर्ष है, तो नौकरी पाने के लिए कितना संघर्ष होता… pic.twitter.com/f5aKWPl2xB
— Kaushik Kanthecha (@Kaushikdd) July 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

