Karur Stampede | తమిళనాడు కరూర్‌లో సినీ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీకిలో తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఘటనపై ప్రాథమిక కారణాలను పోలీసులు గుర్తించారు. పోలీసుల సూచనలు, నియమాలను టీవీకే పార్టీ నాయకులు ఉల్లంఘించినట్లుగా పోలీసులు తేల్చారు. సభకు కేవలం పదివేల మందికి అనుమతి తీసుకున్నారని.. కానీ సభకు ఊహించని విధంగా వేలాది మంది హాజరైనట్లుగా తెలుస్తున్నది. విజయ్ మధ్యాహ్నం 12గంటలకు వస్తాడని నిర్వాహకులు ప్రకటించారని.. అభిమానులు ఆహారం, నీరు లేకుండా ఏడుగంటలు వేచి ఉన్నారని.. దాంతో అభిమానులు నీరు, ఆహారం లేకపోవడంతో కొందరు సొమ్మసిల్లిపడిపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు నటుడు విజయ్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అలాగే, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ కరూర్ ఘటన తర్వాత విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించుకొని వెళ్లిపోయారు. కరూర్ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు ఆయనను ఈ ఘటనపై ప్రశ్నించగా.. మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల మద్రాస్ హైకోర్టు సైతం ఈ విషయంలో హెచ్చరికలు చేసినట్లు సమాచారం. వారం రోజుల కిందట రాజకీయ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమయంలో కార్యకర్తలను ఆ పార్టీ నేత నియంత్రించాలని సూచించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది కోర్టు ప్రశ్నించింది. తిరుచిరాపల్లిలో జరిగిన సమావేశంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కోర్టు ప్రశ్నలు కురిపించింది. ఈ ర్యాలీలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, కరూర్‌లో ప్రసంగం సందర్భంగా ర్యాలీలో తొక్కిసలాటల చాలా మంది కుప్పకూలిపోవడాన్ని చూసిన తర్వాత విజయ్ అంబులెన్స్‌కు కాల్ చేయాలని టీవీకే నాయకులకు సూచించారు. అదే సమయంలో విజయ్ స్వయంగా ఈ విషయంలో పోలీసులను సహాయం చేయాలని కోరాడు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారిందని.. దాంతోనే ఈ విషాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సొమ్మసిల్లిపోయిన వారిలో కార్యకర్తలతో పాటు చిన్న పిల్లలు సైతం ఉన్నారు. పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో అంబులెన్స్‌లు లోపలికి రాలేని పరిస్థితి కొంది. ప్రమాదం తర్వాత విజయ్ తన ప్రసంగాన్ని ముగించి, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అంబులెన్స్‌లకు దారి కల్పించాలని నాయకులకు మైక్ ద్వారా సూచించారు.