చెన్నై, మే 21: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయ ఖజానా(రత్న భండార్) తాళంచెవిలు తమిళనాడుకు వెళ్లాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓట్ల కోసం తమిళనాడుపై, తమిళులపై దుష్ప్రచారం చేయడాన్ని మానుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని తన ద్వేషపూరిత ప్రసంగాలతో రాష్ర్టాల మధ్య కోపాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. ప్రధాని వ్యాఖ్యలు తమిళుల మనో భావాలను గాయపరిచేలా ఉన్నాయన్నారు.