శ్రీలంక అధ్యక్షుడు గోత్బాయా రాజపక్సే సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెప్పా పెట్టకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్లమెంట్‌ను వారం రోజుల పాటు ప్రోరోగ్ (నిలిపేయడం) చేశారు. అంతేకాకుండా హఠాత్తుగా సింగపూర్ పర్యటనకు వెళ్లిపోయారు. అయితే ఈ సింగపూర్ పర్యటన ఆయన జాబితాలో లేదు.ఈ హఠాత్పరిణామంపై శ్రీలంక ప్రభుత్వం ఇంకా స్పందించక పోవడం గమనార్హం. అయితే దీనిపై అధికారులు అనధికారికంగా స్పందించారు. సింగపూర్ పర్యటన అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అని తెలిపారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యానే ఆయన సింగపూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.