Adani | న్యూఢిల్లీ, జనవరి 5: తమ దేశంలోని అదానీ గ్రూప్ ప్రాజెక్టుల సమీక్ష, అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీలంక విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఈ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను రానున్న క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు న్యూస్ఫస్ట్ తెలిపింది. తమ దేశంలో అదానీ గ్రూప్ నెలకొల్పాలనుకున్న పవన విద్యుత్తు ప్రాజెక్ట్‌లపై అధ్యయనానికి ఇటీవల శ్రీలంక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
శ్రీలంకలో 484 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అంచనాతో పవన విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ గతంలో ప్రణాళికలు రూపొందించింది. భారత్‌లో పలు ప్రాజెక్ట్‌లు పొందడానికి అదానీ గ్రూప్ కొందరు అధికారులు, రాజకీయ నాయకులకు లంచాలిచ్చిందని అమెరికాలో ఆరోపణలు వచ్చాయి.