స్పాటిఫైలో ఉద్యోగుల తొలగింపు షురూ..
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను తొలగిస్తు వస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, మెటా వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో స్పాటిఫై కూడా చేరింది. ఈ వారంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను స్పాటిఫై టెక్నాలజీ ఎస్ఏ ప్రారంభించనుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గత అక్టోబర్‌లో సంస్థకు చెందిన గిల్మెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్కాస్ట్ స్టూడియోస్‌కు చెందిన 38 మంది ఉద్యోగులపై వేటువేసింది. ఈసారి మరికొంత మందిని ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేసిందని సమాచారం. అయితే ఎంతమందిని తొలగించనుందనే విషయంపై స్పష్టతరావాల్సి ఉంది. స్పాటిఫైలో 9800 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కాగా, గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 6 శాతానికి సమానమని కంపెనీ వెల్లడించింది. గూగుల్‌తోపాటు అమెజాన్.కామ్, మెటా, మైక్రోసాఫ్ట్ కార్ప్ వంటి కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లను నిలిపివేయడంతోపాటు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో గతేడాది నుంచే మొదలైన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొత్తేడాదిలోనూ కొనసాగుతోంది. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 24 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amazon
- employees
- Laying Off
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

