Delhi airport | ఢిల్లీ విమానాశ్రయంలో ఢీకొన్న రెండు విమానాలు.. రెక్కలు ధ్వంసం.. ప్రయాణికులు క్షేమం
Delhi airport : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. రెండు విమానాల రెక్కలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Delhi airport : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. రెండు విమానాల రెక్కలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన గురువారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జరిగింది. స్పైస్‌జెట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాల మధ్య ఈ ఘటన జరిగింది. స్పైస్‌జెట్ సంస్థకు చెందిన బీ737-700 విమానం టేకాఫ్ అయ్యేందుకు కదులుతుండగా, పక్కనే నిలిచి ఉంచిన ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాన్ని తాకుతూ వెళ్లింది.
ఈ ఘటనలో స్పైస్‌జెట్ విమానం కుడి రెక్క.. ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానపు ఎడమ రెక్కను తాకింది. దీంతో రెండు విమానాల రెక్కలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో రెండు విమానాల్లోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రెండు విమానాల్ని అధికారులు నిలిపివేశారు. ప్రయాణికుల్ని విమానం నుంచి దింపివేశారు. ఈ ఘటనలో తమ క్యూపీ 1406 అనే విమానం దెబ్బతిందని, ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానం నిలిపి ఉందని ఆకాశ సంస్థ తెలిపింది. ఈ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారని, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని విమానయాన సంస్థల ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. ఈ ఘటనపై స్పైస్‌జెట్ సంస్థ కూడా స్పందించింది. తమ సంస్థకు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైందని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రెండు సంస్థలు ప్రకటించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

