జైపూర్: భారీ వర్షాలకు ఎయిర్పోర్ట్ ప్రాంగణం నీట మునిగింది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ పైలట్ (Spice Jet pilot) వినూత్నంగా ఆలోచించాడు. లగేజీ కార్ట్ ద్వారా వర్షం నీటిని దాటి ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో గురువారం భారీగా వర్షం కురిసింది. దీంతో విమానాశ్రయం ప్రాంగణమంతా జలమయమైంది.
కాగా, స్పైస్‌జెట్ పైలట్ క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. వర్షం నీటిని దాటి లోనికి ఎలా వెళ్లాలి అని ఆలోచించాడు. తన కోసం లగేజీ కార్ట్‌ను కారు వద్దకు తీసుకురావాలని విమానాశ్రయ సిబ్బందిని కోరాడు. ఆ ట్రాలీపై పైలట్ నిల్చోగా సిబ్బంది తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతడు ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్పైస్‌జెట్ పైలట్ సమయస్ఫూర్తి, తెలివిని కొందరు అభినందించారు. అతడు తెలివైన వ్యక్తి అని మరికొందరు ప్రశంసించారు.
Pilot rides luggage cart through flooded Jaipur airport, video goes viral.#ViralVideo #Pilot #JaipurAirport #WaterLogging pic.twitter.com/uvOfZv46cc
— TIMES NOW (@TimesNow) August 2, 2024