సేలమ్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. హైవేపై ఆగి ఉన్న డీసీఎంను .. వెనుక నుంచి ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ప్రమాదానికి చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. సేలమ్-ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఈ ఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని.. వెనుక నుంచి వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొన్నది. ఆ వ్యాన్‌లో మొత్తం 8 మంది ఉన్నారు. ఎనుగూరు నుంచి పెరుంతరై వైపు ఆ వ్యాన్ వెళ్తోంది. మృతిచెందినవారిని సెల్వరాజ్, మంజుల, అరుముగం, పళనిస్వామి, పప్పాతిగా గుర్తించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. వ్యాన్ డ్రైవర్ విఘ్నేశ్‌తో పాటు మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్పించారు.
Six people, including a one-year-old child, lost their lives after a speeding van rammed a stationary lorry on the Salem-Erode highway in Tamil Nadu. The accident was captured on a CCTV camera. pic.twitter.com/2Wg7QlT1ch
— News Bulletin (@newsbulletin05) September 6, 2023