లక్నో: బస్సు దిగిన వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. పరుగున రోడ్డు దాటుతున్న అతడ్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. (Speeding Car Hits Man) దీంతో గాలిలోకి ఎగిరి దూరంగా పడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక యువకుడు బస్సు నుంచి కిందకు దిగాడు. పరుగెత్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు.
కాగా, బస్సు వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న కారును గమనించలేదు. దీంతో వేగంగా దూసుకువచ్చిన కారు అతడ్ని ఢీకొట్టింది. ఆ ధాటికి ఆ యువకుడు గాల్లోకి ఎగిరాడు. సుమారు 50 మీటర్ల దూరంలో పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఝాన్సీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఆ యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी के ललितपुर में बस से उतरकर सड़क पार कर रहे युवक को तेज रफ्तार कार ने मारी जोरदार टक्कर,
टक्कर के बाद कई फिट दूर गिरा युवक
घटना CCTV में कैद#UttarPradesh #Lalitpur #CCTVFootage #accident pic.twitter.com/0bfPjd9jFc
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 18, 2025