చెన్నై: అటవీ ప్రాంతం సమీపంలో రోడ్డు దాటుతున్న చిరుతను బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. (Bike Hits Leopard) ఆ బైక్ రోడ్డు పక్కన పడగా చిరుత రోడ్డుపై కుప్పకూలింది. కొంతసేపటి తర్వాత అది స్పృహలోకి వచ్చింది. లేచి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గుడలూర్ ప్రాంతానికి చెందిన రాజన్ బైక్‌పై ప్రయాణించాడు. కేరళ, తమిళనాడు సరిహద్దు సమీపంలోని నడుకాని మరపాలెం వద్ద రోడ్డు దాటుతున్న చిరుత పులిని బైక్‌తో ఢీకొట్టాడు.
కాగా, ఈ ప్రమాదంలో కిందపడిన బైక్ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్వల్పంగా గాయపడిన రాజన్ పైకి లేచి అక్కడి నుంచి దూరంగా వెళ్లాడు. అయితే బైక్ ఢీకొట్టడంతో చిరుత రోడ్డు మధ్యలో పడిపోయింది. చాలా సేపటి వరకు అది కదలలేదు. ఆ తర్వాత చిరుత స్పృహలోకి వచ్చింది. ఉన్నట్టుండి పైకి లేచింది. సమీపంలోని చెట్ల పొదల్లోకి ఆ చిరుత వెళ్లిపోయింది. మరోవైపు ఒక వాహనంలోని వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Kerala: A leopard was injured after being hit by a speeding bike while crossing the road at Nadukani Marapalam on the Kerala-Tamil Nadu border.
The incident occurred around 8 am on Thursday when the bike, ridden by Rajan, a native of Gudalur, collided with the animal. The… pic.twitter.com/tQMRpwZo2B
— South First (@TheSouthfirst) February 27, 2025