లక్నో: రోడ్డు మలుపులోంచి వచ్చిన కారును బైక్‌పై వెళ్తున్న రాపిడో డ్రైవర్ ఢీకొట్టాడు. ప్రమాదం ధాటికి అతడు గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు. (Man Flung Into Air) అక్కడున్న వారు వెంటనే స్పందించారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 13న ఇందిరా నగర్లో సెక్టార్ 13లోని మలుపు నుంచి ఒక కారు వచ్చింది. బైక్‌పై వేగంగా వెళ్తున్న రాపిడో డ్రైవర్ అభిజిత్ శ్రీవాస్త ఆ కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో అతడు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు.
కాగా, ఈ ప్రమాదాన్ని గమనించిన అక్కడున్న వారు వెంటనే స్పందించారు. రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన అభిజిత్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
लखनऊ का बताया जा रहा है ये भयानक एक्सीडेंट का वीडियो !!
कार और बाइक सवार मे आमने-सामने भिड़ंत मे बाइक सवार फुटबॉल की तरह उछलकर गिरा !!
घटना सीसीटीवी कैमरे में हुई कैट वीडियो सोशल मीडिया पर हुआ वायरल !! #Lucknow #ViralVideo #ShockingVideo #Shockingnews pic.twitter.com/wsFbZZ7LPp— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 13, 2025