న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశవ్యాప్త ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను అక్టోబర్‌లో ప్రారంభించవచ్చునని భారత ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సవరణ సన్నాహాలపై సీఈవో ఆధ్వర్యంలో బుధవారం వివిధ రాష్ర్టాలు, యూటీల అధికారులతో చర్చించారు. దీనిపై వారి నుం చి సానుకూల స్పందన లభించింది. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్‌లో ఇటీవల ఎన్నికల సంఘం ‘సర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పు డు దానిని మిగతా రాష్ర్టాలకు కూ డా విస్తరించాలని నిర్ణయించారు. కాగా ‘సర్’కు సంబంధించిన ప్రకటన బీహార్ ఎన్నికలు ముగియడానికి ముందే రావచ్చునని అంటున్నారు. ఓటర్ల ఐడెంటిటీ నిర్ధారణకు కావాల్సిన డాక్యుమెంట్ల లిస్టును తయారు చేయాలని రాష్ర్టాల సీఈవోలను సమావేశంలో ఆదేశించారు. ఈ డాక్యుమెంట్లు స్థానికంగా సులభంగా ఆమోదించేలా, సులువుగా లభ్యమయ్యేలా ఉండాలని సూచించారు. ‘సర్’లో మరణించిన ఓటర్ల పేర్లను లిస్టు నుంచి తొలగించాలని, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్లను, పౌరసత్వం లేని వారిని తొలగించాలని, అదే సమయంలో అర్హులైన వారందరికీ ఓటరు లిస్టులో స్థానం కల్పించాలని కోరారు.
మస్క్‌ను మించిన ‘కుబేరుడు’ లారీ ఎల్లిసన్
న్యూఢిల్లీ: ‘ప్రపంచ కుబేరుడు’ కీర్తిని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (81) ఆ స్థానాన్ని ఆక్రమించారు. ఆయన మొత్తం సంపద విలువ రూ.34,60,143 కోట్లకు (393 బిలియన్ డాలర్లకు) చేరింది. ఎలాన్ మస్క్ సంపద విలువ రూ.33,89,645 కోట్లు (385 బిలియన్ డాలర్లు). ఎలాన్ మస్క్ ప్రపంచంలో అత్యధిక సంపన్నుడు కీర్తిని 2021లో మొదటిసారి సాధించారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ చేజిక్కించుకున్నారు. నిరుడు మళ్లీ ఆ స్థానం మస్క్ వశమైంది.