Jayalalitha | బెంగళూరు, జనవరి 29: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. జప్తు చేసిన జయలలిత ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది.
జయలలితకు లీగల్ వారసులం తామేనంటూ ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్లను జనవరి 13న కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా సీబీఐ కోర్టు గతంలోనే తేల్చింది. 2016లో జయలలిత మరణించిన తర్వాత కేసు విచారణలో జాప్యం జరిగినప్పటికీ ఆమె ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.