న్యూఢిలీ: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కలకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు బుధవారం సుమోటోగా స్వీకరించి, కొత్తగా ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ కేసును గురువారం విచారించనుంది. అంతకు ముందు దీనిని వేరే ధర్మాసనం విచారించి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ధర్మాసనంలో పాత న్యాయమూర్తులు కాకుండా, జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియా ఉన్నారు. వీధి కుక్కలకు సంబంధించి దాఖలైన సుమోటోతో పాటు, ఇతర పిటిషన్లను ఈ ప్రత్యేక ధర్మాసనం విచారిస్తుంది.