సిమ్లా: రేపు, ఎల్లుండి సిమ్లా వేదికగా జరిగే సమావేశంలో సభాపతులు పాల్గొననున్నారు. 1921లో తొలిసారిగా సిమ్లాలో ఇలా సభాపతుల సమావేశం జరిగింది. ఆ భేటీకి వందేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మరోసారి సిమ్లాలోనే సభాపతుల సమావేశం నిర్వహించనున్నారు.
ఈ వందేళ్ల ప్రయాణంలో జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే భవిష్యత్ మార్గదర్శనం, రాజ్యాంగం, చట్ట సభ, సభాపతుల బాధ్యత తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.