Delhi CM : ఢిల్లీ సీఎం పదవికి రెండ్రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సమావేశంలో చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. కేజ్రీవాల్ కీలక ప్రకటన నేపధ్యంలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను కేజ్రీవాల్‌ను కలిశానని, ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలనే ఆయన ప్రతిపాదనపై చర్చలు జరిపామని గోయల్ వెల్లడించారు.
సీఎం కుర్చీపై కేజ్రీవాల్‌కు మోజు లేదని, ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. కేజ్రీవాల్ నిజాయితీపరుడని ఢిల్లీ ప్రజలు విశ్వసిస్తే ఆయనకు తిరిగి సీఎంగా పట్టం కడతారని అన్నారు. సెప్టెంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని స్పీకర్ తెలిపారు. ఇక, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారం పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చేవరకూ సీఎం పగ్గాలు చేపట్టబోనని చెప్పారు.కాగా కేజ్రీవాల్ సంచలన ప్రకటనపై పార్టీ సీనియర్ నేత రాఘవ్ చద్దా స్పందించారు. కేజ్రీవాల్ తన పదవిని త్యజించి అగ్నిపరీక్షకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. ఆప్‌నకు ఓటు వేయడం ద్వారా కేజ్రీవాల్ నిజాయితీపరుడని ఢిల్లీ ప్రజలు నిర్ధారించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దీవార్ మూవీలోని సన్నివేశాన్ని తలపిస్తూ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అమాయకుడని తమ చేతిపై రాసుకోవాలని చద్దా కోరారు.
Read More :
Hyderabad | పెట్రోల్‌కు బదులు నీళ్లు.. ఆందోళన చేపట్టిన వాహనదారులు : వీడియో