న్యూఢిల్లీ: వాహనాల రద్దీతో ఉన్న జాతీయ రహదారిపై నిప్పుల వర్షం కురిసింది. (Sparks rain down) ఇది చూసి వాహనదారులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గుర్గావ్లో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 8పై వాణిజ్య ప్రకటనల బోర్డు ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిప్పు రవ్వలు ఆ రోడ్డుపై వర్షంగా కురిశాయి. కదులుతున్న కార్లు, బస్సులు, బైక్‌లపై నిప్పురవ్వలు పడ్డాయి. ముందు జాగ్రత్త కోసం ఒక బస్సును డ్రైవర్ నిలిపివేశాడు.
కాగా, ఒక డాక్టర్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘గుర్గావ్లోని ఎన్‌హెచ్ 8పై దృశ్యాలు. ట్రాఫిక్ మళ్లింపు లేదా నియంత్రణ లేదు. అగ్నిమాపక భద్రతా జాగ్రత్తలు లేవు. వర్క్ జోన్ ఐసోలేషన్ లేదు. విపత్తుకు దారితీసే సరైన వేదిక’ అని విమర్శించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై నెటిజన్లు మండిపడ్డారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. మరోసారి ఇలా జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆ లేన్ మూసివేస్తామని పేర్కొన్నారు.
Scenes from NH-8, Gurugram.
No traffic diversion or control, no fire safety precautions, no work zone isolation — a perfect recipe for disaster!
Jis hisaab se desh mein kadam kadam par maut ka khel chalta hai, yahan zinda rehna bhi apne aap mein ek uplabdhi hi hai. pic.twitter.com/Dse8wGFq4K
— THE SKIN DOCTOR (@theskindoctor13) December 29, 2024