న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ..మూడవ తరం ‘స్టార్‌షిప్ వీ3’ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించింది. చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మనుషులను, వస్తువులను చేరవేయాలనే లక్ష్యంతో అభివృద్ధి చేశారు. శనివారం తెల్లవారుజామున టెక్సాస్‌లో చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం నాటకీయంగా ముగిసింది. దీని ఇంజన్లలో ఒకటి సరిగా పనిచేయనప్పటికీ, దీని అంతరిక్షక నౌక హిందూ మహాసముద్రంలో నియంత్రిత పద్ధతిలో విజయవంతంగా దిగింది.