ISRO-ESA | వ్యోమగాములకు శిక్షణ, పలు పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలపై సహకరించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)తో ఒప్పందంపై సంతకం చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం పేర్కొంది. ఈ ఒప్పందంపై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఈసా డైరెక్టర్ జోసెఫ్ అష్‌బాచర్ ఒప్పందంపై సంతకం చేశారు. రెండు సంస్థలు మానవ అన్వేషణ, పరిశోధనల్లో సహకరిస్తాయని ఇస్రో ప్రకటనలో పేర్కొంది. వ్యోమగామి శిక్షణ, ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఈసా సౌకర్యాల వినియోగం, మానవ, బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, అలాగే విద్య, ప్రజా అవగాహన కార్యకలాపాలు కలిసి పనిచేస్తాయని ఇస్రో తెలిపింది.
ఆక్సియం-4 మిషన్‌లో ఇస్రో గగన్‌యాన్, ఈసా వ్యోమగాములు ఉన్నారని ప్రకటనలో పేర్కొంది.
ఈ మిషన్‌లో భారత శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆవిష్కరణలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో మానవ సహిత స్పేస్ ఫ్లైట్‌కి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని సోమనాథ్ అన్నారు. భారత్ తన స్వదేశీ అంతరిక్ష కేంద్రం (BAS)ని సైతం నిర్మించనున్నది. ఈసాతో సహకారానికి కొత్త మార్గాలను తెరవనున్నది. ఇంతులో ఈసా చీఫ్ ఈ ఒప్పందాన్ని రెండు ఏజెన్సీలకు చాలా ముఖ్యమైనదని అభివర్ణించారు. ఈ ఒప్పందం రెండింటి మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఆక్సియం-4 మిషన్ కోసం ఉమ్మడి పని పురోగతిపై ఇస్రో, ఈసా చీఫ్‌లు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మానవ అంతరిక్ష కార్యకలాపాల రంగంలో నిరంతర సహకారాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.