అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్

లక్నో : యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసిందని, ఎన్నికల తర్వాత మళ్లీ నల్లచట్టాలను తీసుకువస్తారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రైతులపై ప్రేమతో బీజేపీ సాగు చట్టాలను వెనక్కితీసుకోలేదని కాషాయ పార్టీ రైతులను మోసగిస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ హృదయం పరిశుభ్రమైనది కాదని, సంపన్నుల కోసం పనిచేసే ఆ పార్టీ భూసేకరణ, నల్ల చట్టాలతో రైతులను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.
రైతులను అవమానిస్తూ వారిని కార్లతో తొక్కించిన బీజేపీ పూర్వాంచల్‌లో ఎస్పీ విజయ్ యాత్రకు లభించిన ప్రజల మద్దతు చూసి బెంబేలెత్తి సాగు చట్టాలను రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. వందలాది రైతుల మృతికి కారణమైన దోషులను ఎప్పుడు శిక్షిస్తారో బీజేపీ ప్రజలకు బదులివ్వాలని అఖిలేష్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై యూపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వెల్లడించాలని నిలదీశారు. ప్రధాని మోదీ యూపీలో శుక్రవారం పర్యటిస్తున్న ప్రాంతంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు వెలుగుచూశాయని అన్నారు. ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు వెనక బీజేపీ ఉద్దేశాన్ని కాంగ్రెస్ కూడా తప్పుపట్టింది. కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగు చట్టాలను రద్దు చేశారని ఆ పార్టీ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

