హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని ప్రత్యేక రైళ్లును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గోరఖ్‌పూర్ – హైదరాబాద్ మధ్య సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు (0275)ను ప్రారంభించింది. ఈ రైలు ఇవాళ రాత్రి 9.05 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 6.30గంటలకు గోరఖ్‌పూర్ చేరుకోనున్నది.
మరో వైపు ఈ నెల 14న ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి రైలు (0276) బయలుదేరి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే తిరుపతి – కదిరిదేవరపల్లి మధ్య ప్రత్యేక రైలును ఈ నెల 30న, కదిరిదేవరపల్లి – తిరుపతి ట్రైన్ డిసెంబర్ 1న ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ నెల 14 నుంచి ఎనిమిది మెము అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులకు వినియోగించుకోవాలని కోరింది.
SCR to run Un-Reserved MEMU Special trains between various destinations @RailMinIndia @drmsecunderabad pic.twitter.com/td4bsAS2JR
— South Central Railway (@SCRailwayIndia) November 11, 2021