Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు శుభవార్త చెప్పింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, నాంపల్లి నుంచి భువనేశ్వర్, యశ్వంత్పూర్ నుంచి దర్బంగాకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. శుక్రవారం తిరుపతి-సికింద్రాబాద్ (07497), శనివారం సికింద్రాబాద్ -తిరుపతి (07498) రైలు రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. విజయవాడ-సికింద్రాబాద్ (07213), సికింద్రాబాద్-విజయవాడ (07214) రైళ్లు 17, 18 తేదీల్లో నడుస్తాయని చెప్పింది. హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి)-భువనేశ్వర్ (07165) రైలు నవంబర్ 4 నుంచి 24 వరకు ప్రతి మంగళవారం.. భువనేశ్వర్ (07166) రైలు నవంబర్ 5 నుంచి 26 వరకు బుధవారం అందుబాటులో ఉంటాయని చెప్పింది.
ధర్మవరం-షోలాపూర్ రైలు అక్టోబర్ 18న, దర్బంగా-యశ్వంత్పూర్ (05541) రైలు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 17 వరకు ప్రతి సోమవారం, యశ్వంత్పూర్-దర్బంగా (05542) వరకు అక్టోబర్ 23 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి గురువారం రైలు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. తిరుపతి-సికింద్రాబాద్ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడే, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనున్నాయి. సికింద్రాబాద్ – తిరుపతి రైలు ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ రైలు మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగుతాయి.
హైదరాబాద్ – భువనేశ్వర్ కొత్త – హైదరాబాద్ రైలు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. సోలాపూర్ – ధర్మవరం- షోలాపూర్ రైలు కుర్దువాడి, బర్షి టౌన్, ధారశివ్, లాతూర్, లాతూర్ రోడ్, ఉద్గీర్, భాల్కి, బీదర్, వికారాబాద్, యాద్గిర్, కృష్ణా, రాయచూర్ మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. దర్భంగా – యశ్వంత్పూర్ – దర్భంగా రైలు సమస్తిపూర్, ముజఫర్పూర్, హాజీపూర్, సోన్పూర్, ఛప్రా గ్రామీణ్, ఛప్రా, సివాన్, డియోరియా సదర్, గోరఖ్పూర్, గోండా, బారాబంకి, ఐష్బాగ్, కాన్పూర్ సెంట్రల్, ఒరై, వీజీఎల్ ఝాన్సీ, బీనా, భోపాల్, ఇటార్సీ, చంద్రపూర్, నాగ్పూర్ క్యాబిన్, అమలాపూర్, రామపూర్ క్యాబిన్, అమ్లాపూర్ కాజీపేట, కాచిగూడ, మహబూబ్నగర్, ధోనే, ధర్మవరం, హిందూపూర్, యలహంక స్టేషన్లు ఆగుతాయని వివరించింది.