పాట్నా, జూన్ 11: సమయం వచ్చినప్పుడల్లా మానవత్వాన్ని చాటుకునే నటుడు సోనూసూద్ మళ్లీ వార్తల్లో నిలిచారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన బీహార్ బాలిక ఛౌముఖి కుమారికి ఆపరేషన్ చేయించారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. దీంతో ఆ బాలిక ముఖ్యంలో చిరునవ్వు చిగురించింది. సోనూ సాయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.