Sonu Sood | ముంబై: ప్రజలకు సహాయ పడటమే తన ప్రధాన ధ్యేయమని, అందుకే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలంటూ ఇటీవల వచ్చిన ఒక ఆఫర్ను తాను తిరస్కరించినట్టు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వెల్లడించారు. రాజకీయాల్లో లేకుండానే ప్రజాసేవ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలంటూ ఆఫర్ వచ్చిందన్నారు.
కొందరు శక్తిమంతమైన నాయకులు రాజ్యసభ సీటును కూడా ఇస్తామన్నారని, స్వతంత్రతను కోల్పోవడం ఇష్టం లేక తిరస్కరించినట్టు చెప్పారు. ‘ఎవరెన్ని ప్రతిపాదనలు తెచ్చినా నటనా రంగంపైనే నాకు మక్కువ. సినిమాలను ప్రేమిస్తా’ అని సోనూసూద్ స్పష్టం చేశారు.