న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజనానికి విరామం ఇవ్వడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు. భోజనం అనంతరం మరోసారి ఈడీ అధికారులు సోనియాను విచారించనున్నారు. సోనియా వెంట ప్రియాంకా గాంధీ, వైద్యుల బృందం ఉన్నది. ఇదిలా ఉండగా.. ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఆ పార్టీకి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరులోని ఈడీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆందోళనకారులు కారుకు నిప్పు పెట్టారు. కార్యకర్తలపై వాటర్ కెనన్లు ప్రయోగించారు. 75 మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. అసోంలోను కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా.. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. ఈడీ విచారణ తీరుపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున మండిపడ్డారు. 65 ఏళ్లుపైబడిన వారి ఇండ్లకు వెళ్లి అధికారులే విచారిస్తారని.. కానీ, ఇక్కడ అలా జరుగడం లేదన విమర్శించారు.