న్యూఢిల్లీ : పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆయన దీక్ష శుక్రవారం 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే పార్లమెంట్ మార్చ్ వరకు తాను ప్రాణాలతోనే ఉంటానని చెప్పారు. అది సాధ్యం కాకపోతే ఆత్మగానైనా తిరిగి వస్తానని చెప్పారు. ‘బయటకు నేను బలహీనంగా ఉన్నాను కాని లోపల ఎంతో బలంగా ఉన్నాను. మీరంతా బయట, లోపల బలంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనకు ఈ శక్తి ఈ నెల 20 వరకు కావాలి’ అని అన్నారు.