న్యూఢిల్లీ : ఈ-20 పెట్రోల్ మీద అత్యధిక వాహనదారులు పరిహారం కోరేందుకు కోర్టులకు వెళ్తామంటున్నారు. లోకల్ సర్కిల్స్ సర్వే నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ-20 పెట్రోల్ వల్ల తమ వాహనం దెబ్బతింటోందని.. ఇంజిన్ లో సమస్యలు, మైలేజీ తగ్గిపోవడం లాంటి ప్రధాన సమస్యలు ఎదురవుతున్నట్టు వాహనదారులు వాపోతున్నారని ఈ సర్వే తెలిపింది. ఇందులో సగం మంది వరకు పరిహారం కోసం వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడానికి రెడీ అవుతున్నట్టు ఈ సర్వే చెప్పుకొచ్చింది.
లోకల్ సర్కిల్స్ సర్వే 316 జిల్లాల్లో 22వేల మంది వాహనదారులపై ఈ సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ-20 పెట్రోల్ వల్ల తమ వాహనం దెబ్బతింటోందని.. 31 శాతం మంది వినియోగదారులు ఫోరంను ఆశ్రయిస్తామని చెబుతున్నారు. 14 శాతం మంది అన్ని రకాల చట్టపరమైన చర్యలకు దిగుతామంటున్నారు. 45 శాతం మంది చట్టపరంగా కోర్టులకు వెళ్తామంటున్నారు.