న్యూఢిల్లీ: లఢక్‌ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ‘ఢిల్లీ చలో పాదయాత్ర’ చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, మరికొందరిని ఢిల్లీ సరిహద్దుల్లో సోమవారం రాత్రి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీనికి నిరసనగా వాంగ్‌చుక్, మరికొందరు మంగళవారం నిరాహార దీక్ష ప్రారంభించారు.
లఢక్‌కు రాష్ట్ర హోదా కల్పించి ఆరో షెడ్యూల్లో చేర్చాలని లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ గత నాలుగేండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఢిల్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకే వాంగ్‌చుక్, మరికొందరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వాంగ్చుక్ను కలవడానికి ఢిల్లీ సీఎం ఆతీశీకి ఎల్జీ అనుమతి ఇవ్వలేదు.