లేహ్‌లో సరిహద్దు ర్యాలీ విరమణ
గత ఐదేండ్లలో చైనా భారత్ భూభాగాన్ని పెద్దమొత్తంలో ఆక్రమించుకొన్నదని వాంగ్‌చుక్ ఆరోపించారు.
లేహ్: గత ఐదేండ్లలో చైనా భారత్ భూభాగాన్ని పెద్దమొత్తంలో ఆక్రమించుకొన్నదని వాంగ్‌చుక్ ఆరోపించారు. లడఖ్‌కు స్వయం ప్రతిపత్తి కోరుతూ ఆందోళనకారులు ఆదివారం వాస్తవధీన రేఖ వెంబడి చాంగ్తాంగ్ వరకు ‘పష్మినా(సరిహద్దు) ర్యాలీ’ నిర్వహించాలనుకొన్నా.. చివరి నిమిషంలో దాన్ని విరమించుకొన్నారు. పోలీసులు, ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి వద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు లేహ్ అపెక్స్ బాడీ తెలిపింది. అయితే శాంతియుత ఆందోళనను కొనసాగిస్తామని చెప్పింది.
అంతకు ముందు ఈ ర్యాలీపై స్థానిక యంత్రాంగం ఆంక్షలు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా ఎటుంటి ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పర్యావరణ కార్యకర్త వాంగ్‌చుక్ శనివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. లడఖ్వాసులు దాదాపు లక్షా 50 వేల చదరపు కిలోమీటర్ల భూమిని భారత కార్పొరేట్లకు కోల్పోయారని తెలిపారు. లేహ్‌ను వార్ జోన్‌గా మార్చారని అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత ఆందోళనను హింసాత్మకంగా మార్చి, తర్వాత లడఖ్వాసులను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

