తిరువనంతపురం, సెప్టెంబర్ 10: న్యాయస్థానం ఇచ్చి ఆదేశాలను బేఖాతరు చేస్తూ వృద్ధురాలైన తల్లికి పోషణ ఖర్చులు చెల్లించడానికి నిరాకరించిన ఒక కుమారుడిని కేరళలోని కోర్టు జైలుకు పంపింది. కేసు వివరాల్లోకి వెళితే.. మాలప్పరికి చెందిన ప్రతీశ్కు వృద్ధురాలైన తల్లి ఎలియమ్య జోసెఫ్ ఉంది. ఆమె పోషణకు నెలకు రూ.2 వేలు చెల్లించాలని ట్రిబ్యునల్ గతంలో అదేశించినా అతడు దానిని లెక్క చేయలేదు. దీంతో బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది.
ప్రతీశ్కు పలుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కాన్హాగడ్ ఆర్డీవో కోర్టు ముందు హాజరపర్చగా, ఆయనను జైలుకు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆరు నెలల బకాయి రూ.12 వేలను తన తల్లికి చెల్లించే వరకు నిందితుడిని జైలులోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది.