గోండ (యూపీ) : కాబోయే అత్తతో కలిసి అలీగఢ్ వ్యక్తి పారిపోయిన ఉదంతం మరువకముందే అలాంటి ఘటనే ఈసారి యూపీలోని గోండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం 25 ఏండ్ల సుశీల్ (పేరు మార్చారు) తాను పెండ్లి చేసుకోబోయే వధువు తల్లి రేఖ (పేరు మార్చారు)తో శనివారం పారిపోయాడు. దీనిపై వధువు గీత (పేరు మార్చారు), ఆమె కుటుంబ సభ్యులు ఖోడారే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసును నమోదు చేశారు. వీరి వివాహం నాలుగు నెలల క్రితమే నిశ్చయమైంది. ఈ క్రమంలో సుశీల్, రేఖా తరచూ మొబైల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకునే వారు. వారిద్దరి వైఖరిని రేఖ కుటుంబ సభ్యులు అనుమానించి వివాహ వేదికను మార్చినా ఫలితం లేకపోయింది.