కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అత్తను అల్ల్లుడు పెండ్లి చేసుకోవటాన్ని చూసి అందరూ విస్తుపోతున్నారు. కోర్టులో ఈ జంట పరస్పరం పూలదండలు మార్చుకుంటూ, వివాహ ధృవీకరణ పత్రాన్ని పట్టుకుని ఉన్న విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహం అనంతరం వరుడు తాను అత్తను పెండ్లి చేసుకున్నట్లు వీడియోలో తెలిపాడు. నాలుగేండ్ల పాటు వీరి మధ్య అఫైర్ నడిచిందని, తరువాత వీరు వివాహం చేసుకున్నారని సమాచారం. ఈ ఘటన కాన్పూర్ దేహాత్ జిల్లాలోని అక్బర్పూర్లో చోటుచేసుకున్నది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి వీడియోను చూసిన ఒక నెటిజన్ ‘వీరిది సంచలన ప్రేమకథ మాత్రమే కాదు. ఒక కుటుంబాన్ని ముక్కలు చేసిన కథ’ అని వ్యాఖ్యానించారు.