శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని సోపోర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో సిపాయి పంగల కార్తీక్ ప్రాణాలు కోల్పోయారు. సైనికాధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, జలూర గుజ్జర్పటిలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గాయపడిన కార్తిక్‌ను, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కార్తీక్ ప్రాణ త్యాగం చేశారని, ఆయనకు చినార్ కోర్‌లోని అన్ని ర్యాంకుల సిబ్బంది, అధికారులు గౌరవ వందనం చేస్తున్నారని భారత సైన్యంలోని చినార్ కోర్ ఓ పోస్ట్‌లో తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపింది.