Snakebite Pill | న్యూఢిల్లీ: మనదేశంలో పాము కాటుకు గురై ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకటి.. రెండు గంటల్లోగా (గోల్డెన్ అవర్) పేషెంట్‌కు యాంటీ వీనమ్ (స్నేక్ బైట్ సెరా) ఇంజెక్షన్ ఇవ్వకపోతే ప్రాణాలు దక్కటం అనుమానమే.
చాలా మంది దవాఖానకు వెళ్లే మార్గంలోనే ప్రాణాలు విడిచిపెడతారు. దీనికి పరిష్కారంగా గోల్డెన్ అవర్‌ను పెంచే క్రమంలో సైంటిస్టులు గోలీని తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వెలువడ్డాయి.
మందు బిళ్ల తీసుకున్న కేసుల్లో గోల్డెన్ అవర్ 5 గంటల వరకు పెరిగిందని తాజా ప్రయోగాల్లో తేలింది. కోల్‌కతాలోని రెండు ప్రభుత్వ దవాఖానాల్లో ట్రయల్స్ చేపట్టగా సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో ‘గోల్డెన్ అవర్’ సమయం మరో గంట పెరుగుతున్నదని, ట్రయల్స్‌లో పాముకాటు బాధితులంతా ప్రాణాలతో బయటపడ్డారని వైద్యులు చెప్పారు.