Snake | నడుస్తున్న రైలులో ఒక్కసారిగా పాము (Snake) ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భోపాల్ – జబల్పూర్ (Bhopal – Jabalpur) మధ్య నడుస్తున్న జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (Jan Shatabdi Express) రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్ లగేజీ మధ్య పాము ప్రత్యక్షం అయినట్లు పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హర్షిత్ శ్రీవాస్తవ తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని, పామును కూడా పట్టుకున్నట్లు చెప్పారు. రైలును శానిటైజ్ చేయడంతోపాటు కార్మికులను కూడా అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా, రైళ్లలో పాములు ప్రత్యక్షం కావడం ఇదేమీ తొలిసారి కాదు. గత నెల అంటే అక్టోబర్ 21న జార్ఖండ్ నుంచి గోవా మధ్య నడుస్తున్న వాస్కోడిగామా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో పాము కనిపించింది. ఏసీ 2-టైర్ కోచ్ లోయర్ బెర్త్ కర్టెన్ల దగ్గర పాము ప్రతక్షం కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఐఆర్సీటీసీ సిబ్బంది సాయంతో పామును పట్టుకున్నారు. అదేవిధంగా సెప్టెంబర్‌లో జబల్పూర్-ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏప్రిల్‌లో మధురై-గురువాయూర్ ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడిని పాము కాటు వేసింది. వరుస ఘటనలతో రైలు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Dhanush | కలిసి ఉండాలనుకోవడం లేదు.. మాకు విడాకులివ్వండి : కోర్టుకు హాజరైన ధనుష్ – ఐశ్వర్య జంట
Kasthuri | తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి ఊరట