చండీగఢ్: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రిని ఒక పాము కాటేసింది (Snake Bites Punjab Minister). ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం బాగానే ఉన్నదని తెలిపారు. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ఈ నెల 15న తన నియోజకవర్గంలో జరిగిన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలుపై పాము కాటేసింది. ఈ నేపథ్యంలో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, మంత్రి హర్జోత్ సింగ్ ఈ విషయాన్ని ఎక్స్ ( ట్విట్టర్) ద్వారా తెలిపారు. పాము కాటు వేసిన కాలు, ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఫొటోలను పోస్ట్ చేశారు. భగవంతుని దయ వల్ల తన నియోజకవర్గం శ్రీ ఆనందపూర్ సాహిబ్‌లో వరద పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని తెలిపారు. ఆగస్ట్ 15న రాత్రి వేళ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న తనను విషపూరిత పాము కాటు వేసినట్లు చెప్పారు. అయితే ప్రజలకు సహాయం చేయాలనే తన కృతనిశ్చయాన్ని ఇది అడ్డుకోలేదని అన్నారు. దేవుడి దయ, ప్రజల ప్రేమ, ఆశీర్వాదంతో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.
With God's grace, the flood situation in my constituency, Shri Anandpur Sahib, is better now.
During the rescue operations, I was bitten by a venomous snake on the intervening night of 15th Aug, but that didn’t deter my determination to help my people.
With God’s grace and… pic.twitter.com/vQkX14xltK
— Harjot Singh Bains (@harjotbains) August 19, 2023