కారేపల్లి, డిసెంబర్ 30 : సింగరేణి (కారేపల్లి) మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్ట్ దమ్మాలపాటి కృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మూడోసారి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా భీమవరపు శ్రీనివాసరావు, కోశాధికారిగా పాలిక శ్రీనివాస్‌తో పాటు ప్రధాన కార్యదర్శిగా బానోతు బాలు నాయక్, ఉపాధ్యక్షుడిగా ధరావత్ కళ్యాణ్, సహాయ కార్యదర్శిగా కేతిమల్ల సురేశ్, గౌరవ అధ్యక్షుడిగా తేల్ల శ్రీనివాసరావును సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం నూతన ప్రెస్ క్లబ్ కమిటిని తోటి జర్నలిస్టులు అనంతారపు వెంకటాచారి, పగడాల నాగేశ్వరరావు, కొండపల్లి వెంకటేశ్వరరావు, ముక్క వెంకటేశ్వర్లు, కొత్తూరు శ్రీనివాసరావు, ఏపూరి లక్ష్మీనారాయణ, బాధవత్ రాము నాయక్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ చైర్మన్ భీమవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పాలకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Karepally : కారేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ